మీరు కరోనా బారినపడితే.. ఎక్కువగా చికెన్, గుడ్లు తినాలట.. శాకాహారులైతే అవి తీసుకోవాలట.!

Spread the love

కరోనా సోకిన రోగి ఎక్కువగా ప్రోటీన్స్ ఉండే ఫుడ్స్ తినాలని డాక్టర్స్ సూచిస్తారు. శరీరానికి ఇమ్యూనిటీ తగిన మోతాదులో అందితే ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతుందని.. అందుకే ప్రోటీన్స్ ను ఆహారం ద్వారా అందుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. మరి నాన్ వెజ్ తినేవారు ఏం తినాలి.? అదే శాకాహారులైతే ఏం తినాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం.!

మాంసాహారులు ఏం తినాలి.? కరోనా ఇన్ఫెక్షన్ బట్టి రోగికి కిలోకు 1 గ్రాము నుంచి 1.5 గ్రాము దాకా ప్రోటీన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆహారం ద్వారా ఈ ప్రోటీన్స్ శరీరంలోకి చేరాలంటే ఎక్కువగా గుడ్లు, చికెన్, చేపలు లాంటివి తినాలి.

శాకాహారులు ఎక్కువగా పప్పు దినుసులు తినాలి.! శాకాహారులు ఎక్కువగా పప్పు దినుసులు తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కందిపప్పు, పెసర, మినపప్పు లాంటి వాటిలో 24 శాతం వరకు ప్రోటీన్ ఉంటుందని.. అలాగే బొబ్బర్లు, శనగలు వంటి వాటిల్లో కావాల్సినంత ప్రోటీన్ తో పాటు విటమిన్ బీతో పాటు పీచు పదార్ధాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. అటు పాల సంబంధిత ఉత్పత్తులైన చీజ్, పన్నీర్ తో పాటు సీడ్స్, నట్స్ లో కూడా అధిక శాతం ప్రోటీన్స్ ఉన్నాయన్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచుకోండిలా.? పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం ద్వారా మనం రోగ నిరోధక శక్తిని ఎక్కువగా పెంపొందించవచ్చు. బాదంపప్పులు ప్రతీ రోజూ తినడం వల్ల విటమిన్-ఈ, జింక్, ఐరన్ లభిస్తాయి. అటు పెరుగు కూడా రోజూ తినడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అటు కాల్షియం, మినరల్స్, విటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక పచ్చి మామిడికాయలో విటమిన్ ఏతో పాటు సీ కూడా అధిక మోతాదులో లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *