బాలీవుడ్‌లో మరో సినిమా..

Spread the love

రష్మిక మందన్న దూకుడు మామూలుగా లేదు. వరుసగా సినిమా తర్వాత సినిమాకి సైన్ చేస్తూనే ఉంది. తెలుగు తమిళం, హిందీ పరిశ్రమలలో క్రేజీ హీరోయిన్‌గా భారీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకుంటూ మూడు ఇండస్ట్రీలలోనూ హాట్ టాపిక్ అవుతోంది.

తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమా చేస్తోంది. పాన్ ఇండియ సినిమాగా అయిదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఆగస్ట్ 13న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇటీవల కోలీవుడ్‌లో సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మంచి గుర్తింపును తెచ్చుకుంది.

ఇదే క్రమంలో బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే సిద్దార్త్ మల్‌హోత్రాకి జంటగా మిషన్‌ మజ్ను, బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్‌ బై సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా త్వరలోనే మరో బాలీవుడ్ సినిమాకి సైన్ చేయబోతున్నట్టు ఇంటరాక్టివ్ సెషన్‌లో భాగంగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి స్వయంగా రష్మిక సమాధానం చెప్పింది. మొత్తం మూడు సినిమాలు చేస్తున్న రష్మిక బాలీవుడ్‌లో అతికొద్ది రోజుల్లోనే స్టార్ స్టేటస్ అందుకోవడం ఖాయమని అర్థమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *