మహాత్మాజ్యోతిబాపూలే వెనుకబడిన గురుకుల విద్యాసంస్థలో ప్రవేశాలు

Spread the love

హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఇంటర్‌, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలు జరుగుతున్నట్టు సంస్థ కార్యదర్శి మల్లయ్యబట్టు ఒక ప్రకలనలో తెలిపారు.

బాల బాలికలకు ఇంగ్లీష్‌ మీడియం జూనియర్‌ కళాశాలలు, మహిళా డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను దాఖలు చేయడానికి 31-5-2021 తేదీ ఆఖరు అని తెలిపారు. అర్హులైన బిసి, ఎస్‌సి, ఎస్‌టీ, ఈబీసీ విద్యార్ధినీ, విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *