రేపు జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం

Spread the love

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. కాగా, సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటికే నిర్ణయించిన జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో 48వ సీజేఐగా జస్టిస్‌ ఎన్వీ రమణ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించనున్నారు.

దేశంలో కోవిడ్‌ వ్యాప్తి రీత్యా.. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు కేంద్రమంత్రులు, కేబినెట్‌ సెక్రటేరియట్‌ అధికారులు, న్యాయ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతోపాటు జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొననున్నారు. అలాగే జస్టిస్‌ బోబ్డే వీడ్కోలు సమావేశం రేపు సాయంత్రం వర్చువల్‌గా నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *