భార‌త్ విమానాల‌పై కెన‌డా నిషేదం..

Spread the love

ఒట్టావా: భార‌త్‌లో క‌రోనా కేసులు ఉధృతంగా న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. భార‌త‌దేశం నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేదం విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెన‌డా కూడా చేరింది.

ఇండియా నుంచి వ‌చ్చే ప్యాసింజ‌ర్, క‌మ‌ర్షియ‌ల్ విమానాల‌ను 30 రోజుల‌పాటు నిషేదిస్తున్న‌ట్లు ర‌వాణాశాఖ మంత్రి ఒమ‌ర్ అల్ఘ‌బ్రా ప్ర‌క‌టించారు. భార‌త్ నుంచి కెన‌డాకు వ‌స్తున్న విమాన ప్ర‌యాణికుల్లో ఎక్కువ‌గా క‌రోనా కేసులను గుర్తించ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు.

ఇండియాతోపాటు పాకిస్థాన్‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. అయితే కార్గో విమానాలు, వ్యాక్సిన్ల వంటి అత్య‌వ‌స‌ర స‌రుకుల‌ను ర‌వాణా చేసే విమానాలు య‌ధావిధిగా న‌డుస్తాయ‌ని చెప్పారు.

గ‌త రెండు వార‌ల్లో కెన‌డాలోని టొరంటో లేదా వాన్‌కోవ‌ర్‌కు ఢిల్లీ నుంచి 18, లాహోర్ నుంచి రెండు విమానాలు వ‌చ్చాయ‌ని, వారిలో ఒక్కో విమానంలో క‌నీసం ఒక్క ప్ర‌యాణికుడైనా అనారోగ్యం ఉన్నార‌ని ఆదేశ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. కాగా, కెన‌డాకు వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు 14 రోజుల క్వారంటైన్ త‌ప్ప‌నిస‌ర‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *