24 గంట‌ల్లో భారీగా కొత్త కేసులు..

Spread the love

రోజురోజుకూ క‌రోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. గ‌త వారం రోజుల నుంచి వ‌రుస‌గా రెండు ల‌క్ష‌ల‌కు తగ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 2,73,810 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,619 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అయితే కొత్త కేసుల సంఖ్య‌తో పోల్చితే క‌రోనా నుంచి రిక‌వ‌రీ అవుతున్న బాధితుల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంటున్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల్లో కేవ‌లం 1,44,178 మంది మాత్ర‌మే మ‌హ‌మ్మారి బారినుంచి కోలుకున్నారు. అంటే కొత్త‌గా న‌మోదైన కేసుల‌లో రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య దాదాపు స‌గం మాత్ర‌మే ఉన్న‌ది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వివ‌రాలను వెల్ల‌డించింది.

కాగా, తాజాగా న‌మోదైన కొత్త కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. అందులో 1,29,53,821 మంది బాధితులు వైర‌స్ బారి నుంచి కోలుకోగా మ‌రో 19,29,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తాజాగా న‌మోదైన 1,619 క‌రోనా మ‌ర‌ణాల‌తో క‌లిపి దేశంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా 1,78,769కి పెరిగింది. ఇదిలావుంటే దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ఇచ్చిన టీకాల సంఖ్య‌ 12,38,52,566కు చేరింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వివ‌రాలను వెల్ల‌డించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *