టి20 ప్రపంచ కప్‌కు పాకిస్తాన్‌ ఆటగాళ్ల వీసాకు లైన్‌ క్లియర్‌..!

Spread the love

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ మధ్య జరగాల్సిన టి20 ప్రపంచ కప్‌కు వేదికలను బిసిసిఐ ఎంపిక చేసింది. ఈసారి ఎంపిక చేసిన వేదికల్లో హైదరాబాద్‌ కూడా ఉండడంతో తెలుగు క్రికెట్‌ క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్‌ సహా 8 వేదికలను టి20 ప్రపంచ కప్‌ కోసం బిసిసిఐ ఎంపిక చేసింది. అయితే, ఏ వేదికపై ఏ మ్యాచ్‌ జరుగుతుందనే విషయంలో బిసిసిఐ స్పష్టం చేయలేదు.

కానీ, ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నట్టు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా ఉధృతంగా ఉండడంతో కరోనా నిబంధనలను, మార్గాదర్శకాలను దృష్టిలో ఉంచుకునే మహా సయరానికి ఏర్పాట్లు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇక ఆటగాళ్ల వీసాల విషయానికి వస్తే.. అన్ని జట్లకూ వీసాలు లభించనున్నట్లు బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. దీంతో పాకిస్తాన్‌ ఆటగాళ్లకు కూడా వీసాలు అందనున్నాయి. కాగా, భారత్‌, పాకిస్తాన్‌ మధ్య రాజకీయ సంబంధాలు తెగిపోవడం వల్ల ఈ రెండు జట్లు చాలు ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీసుల్లో పాల్గొనలేదు.

ఇక టి20 ప్రపంచకప్‌కు వీసాల సమస్య క్లియర్‌ కావడంతో మళ్లీ చాలా ఏళ్ల తరువాత భారత్‌లో పాకిస్తాన్‌ జట్టు పర్యటించనుంది. టి20 ప్రపంచ కప్‌ జరుగుతున్నప్పటికీ ప్రేక్షకులకు స్టేడియంలలోకి అనుమతి ఉంటుందా, ఉండదా అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మ్యాచుల నిర్వహణే కష్టం. కరోనా కేసులు భారీ సంఖ్యల్లో పెరుగుతుండటంతో బిసిసిఐ, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *