నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా సుశీల్‌ చంద్ర

Spread the love

న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి)గా సుశీల్‌చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత సిఇసి సునీల్‌ ఆరోరా పదవీకాలం సోమవారంతో ముగిసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త సిఇసిగా సుశీల్‌ చంద్ర మంగళవారం నాడున బాధ్యతలు స్వీకరిస్తారని న్యాయశాఖ తెలిపింది. సుశీల్‌ చంద్ర ఈ పదవిలో వచ్చే ఏడాది మే 14 వరకు కొనసాగే అవకాశం ఉంది. సుశీల చంద్ర హయాంలోనే గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఆయా అసెంబ్లీల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 14న సుశీల్‌ చంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు సుశీల్‌ చంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఛైర్మన్‌గా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *