అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ‌..

Spread the love

అందాల ముద్దుగుమ్మ అన‌సూయ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి మ‌నందరికి తెలిసిందే. త‌న ప్రాజెక్టుల విష‌యాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ అడ‌పాద‌డ‌పా హాట్ హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్‌గా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించిన అన‌సూయ .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

ప్ర‌స్తుతం మ‌మ్ముట్టి చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న అన‌సూయ‌.. త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నేను క‌లిసి చేసే రచ్చ చూసేందుకు సిద్ధంగా ఉండండి. ఆ సంద‌డి మీకు చూపించాల‌ని చాలా ఆతృత‌గా ఉంది అని పేర్కొంది. అన‌సూయ కామెంట్స్ తో మెగా అభిమానులు అంద‌రు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- క్రిష్ మూవీలో ఈ హాట్ యాంక‌ర్ ముఖ్య పాత్ర పోషిస్తుందేమో అని ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఇది కాక‌పోతే రానా-ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సినిమాలో న‌టిస్తుంద‌ని అంటున్నారు.త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రావ‌డం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *