నేడు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలతో సోనియా, రాహుల్‌ భేటీ

Spread the love

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం సమావేశం కానున్నారు.

వర్చువల్‌ పద్ధతిలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీనియర్‌ నేత, సోనియా కుమారుడు రాహుల్‌ గాంధీ కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎలా సాయపడాలన్న అంశాలపై అధిష్టానం సూచనలు ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.

కాగా, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్తాన్‌, యుపి, ఉత్తరాఖండ్‌, బీహార్‌లు కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ కొరతపై స్పందించిన రాహుల్‌… అవసరమైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు ఇవ్వాలని, విదేశాలకు వ్యాక్సిన్ల ఎగుమతి నిలిపివేయాలని ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *