ఇండియన్‌ రైల్వేలో ఇంజినీర్‌ పోస్టులు..

Spread the love

భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్‌ రైల్లే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఇర్కాన్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఇర్కాన్‌ సూచించింది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 18 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఇంజినీరింగ్‌ విభాగంలో 74 పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ఛత్తీస్‌గఢ్‌, జర్ఖండ్‌, కర్ణాటక, రాజస్థాన్‌, బీహార్‌, సిక్కిం, మధ్యప్రదేశ్‌, త్రిపుర, గుజరాత్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 74
ఇందులో సివిల్‌ వర్క్స్‌ ఇంజినీర్‌ 60, ఎస్‌ అండ్‌ టీ వర్క్స్‌ ఇంజినీర్‌ 14 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: బీటెక్‌లో సివిల్‌ ఇంజినీర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ క్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. 30 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం తప్పనిసరి.

ఎంపిక విధానం: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో..

దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 18

వెబ్‌సైట్‌: www.ircon.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *