ప్రిన్స్‌ ఫిలిప్‌ మృతి..

Spread the love

లండన్‌ : బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (99) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. ఇటీవల ఆయనకు గుండెకు సంబంధించిన ఆపరేషన్‌ జరిగింది. అనంతరం ప్యాలెస్‌కు తీసుకొచ్చారు. శుక్రవారం ఆయన పరిస్థితి విషమించి మరణించారు. ఈమేరకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రకటించింది.

గ్రీకు యువరాజైన ఫిలిఫ్‌ 1947లో ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి రాణి వెన్నంటి ఉండి పాలనాపరంగా అన్నినిధాలా.. సహాయసహకారాలు అందించారు. ఈయన రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో రాచరికం ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించారు. ‘నా భర్తే నాకు కొండంత బలం’ అని 1997లో వారి 50వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌ తన ప్రసంగంలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *