సంపూర్ణేష్ బాబు హీరోగా ‘పుడింగి నెంబర్ 1’

Spread the love

టాలెంటును నమ్ముకుని వచ్చి కలబడి నిలబడిన ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. ఆ జాబితాలో సంపూర్ణేశ్ బాబు పేరు కూడా బోల్డ్ లెటర్స్ లోనే కనిపిస్తుంది. అయితే, ‘కొబ్బరి మట్ట’ తరువాత ఆ స్థాయిలో ఆయన మరో సినిమా చేయలేదు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన ఆయన, తాజాగా మరోసారి హీరోగా ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరే ‘పుడింగి నెంబర్ 1 ‘.

సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా ఈ రోజునే ఈ సినిమా హైదరాబాద్ – రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కేఎస్ రామారావు క్లాప్ ఇవ్వగా .. భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేయగా ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాతో మీరావలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఇక పలు చిత్రాలలో హాస్యనటిగా మెప్పించిన విద్యుల్లేఖ రామన్ ఈ సినిమాతో కథానాయిక అవుతోంది. మరో కథానాయికగా సాఫీ కౌర్ పరిచయమవుతోంది. పోసాని … అజయ్ ఘోష్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమా, ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగు జరుపుకోనుంది. జులైలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *