మల్లెలను ఔషధాలుగా ఎలా ఉపయోగించవచ్చో మీకు తెలుసా..!

Spread the love

మల్లెలు వెన్నెలా స్వచ్ఛంగా ఉండి.ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాదు.. మానసిక ఆనందాన్ని కూడా ఇస్తాయి. అయితే మల్లి పూలల్లో ఔషధాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మల్లెల పరిమళం మనసుకు ఆహ్లదాన్ని ఇస్తే.. కళ్ళమంటలు, తలనొప్పి వంటి అనేక వ్యాధులకు ఉపశమనం ఇస్తాయని అంటున్నారు. ఇప్పుడు మల్లెలను ఔషధాలుగా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం..!

*మానసికంగా ఒత్తిడికి గురవుతున్నా.. డిప్రెషన్, అతి కోపం వీటన్నిటినీ శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉంది. స్వచ్ఛమైన తాజా మల్లెలను తల దిండు పక్కనే పెట్టుకుని నిద్రించాలి. లేదంటే దీర్ఘ శ్వాసతో సువాసనను పీల్చాలి. ఇలా రోజుకు పదిసార్లు చేస్తే.. మంచి నిద్ర పడుతుంది. మనసు ఆహ్లాదంగా మారుతుంది.

*తలనొప్పి తరచుగా వచ్చే వారు .. ఈ పువ్వులను తలకు బట్టలో కట్టి.. వాసెనకట్టు కడితే మంచి ఉపశమనం లభిస్తుంది.

*మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని.. కలిపి ముఖానికి అప్లై చేస్తే.. ఛాయ మెరుగుపడుతుంది.

*కొబ్బరినూనెలో గుప్పెడు మల్లెపూలను వేసి ఒకరోజంతా నానబెట్టాలి. ఆ తరువాత కాచి వడగట్టాలి. చల్లారాక తలకు మర్దన చేసుకుంటే.. జుట్టు కుదుళ్లకు పోషకాలు అందుతాయి.

*వేడికి కళ్ళ మంటలు, నొప్పులు అనిపిస్తే.. మల్లెల కషాయాన్ని ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు. ముందు మల్లె పువ్వులను, ఆకులను కలిపి నీటిలో వేసి మరగబెట్టి కషాయం కాచాలి. ఈ కషాయాన్ని వడగట్టి చల్లార్చి.. రెండువంతుల కషాయంలో ఒక వంతు నువ్వులనూనె, ఒకవంతు కొబ్బరినూనె, ఒక స్పూను బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేసుకుంటే కళ్ళకు ఉపశమనం లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *