రష్మిక లుక్‌ అదిరింది..!

Spread the love

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది రష్మిక మందన్న. మోడలింగ్ రంగంలో నుంచి .. కిర్రాక్ పార్టీ కన్నడ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది. కన్నడ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా శర్వానంద్‌తో జంటగా తిరుమల కిషోర్‌ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’.

సోమవారం రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పసుపు రంగు చీర కట్టుకుని చిరునవ్వు నవ్వుతూ గార్డెన్‌లో కూర్చొని దేవుడి కోసం బంతి పూలదండ కడుతున్న రష్మిక లుక్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. రష్మిక లుక్‌ అదిరింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ‘మిషన్‌ మజ్ను’తో హిందీ తెరకు కూడా ఆమె పరిచయం కాబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *