గుజరాత్లో చెత్త ట్రాక్ట‌ర్‌లో వెంటిలేట‌ర్ల త‌రలింపు..

Spread the love

సూర‌త్ : ‌సోమ‌వారం ఒక్క‌రోజే గుజ‌రాత్‌లో కొత్త‌గా 3,160 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా వైర‌స్ కార‌ణంగా సోమ‌వారం 15 మంది మృతి చెంద‌గా, మృతుల సంఖ్య 4,581కి చేరింది. అహ్మదాబాద్‌లో 773, సూర‌త్‌లో 603, రాజ్‌కోట్‌లో 283, వ‌డోద‌ర‌లో 216 కేసులు న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

అయితే తాజాగా అయితే సూర‌త్ జిల్లాలో కేసుల తీవ్ర‌త అధికంగా ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ వెంటిలేట‌ర్ల కొర‌త ఏర్ప‌డింది. దీంతో వ‌ల్సాడ్ నుంచి సూర‌త్‌కు వెంటిలేట‌ర్ల‌ను త‌ర‌లించాల‌ని అధికారుల‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది. అయితే ఈ వెంటిలేట‌ర్ల త‌ర‌లింపులో అధికారులు నిర్ల‌క్ష్యం వ‌హించారు.

ఐసీయూలో ఉండే వెంటిలేట‌ర్ల‌ను చెత్త ట్రాక్ట‌ర్‌లో త‌ర‌లించ‌డంతో వ‌ల్సాడ్ జిల్లా క‌లెక్ట‌ర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. అయితే వెంటిలేట‌ర్ల త‌రలింపు కోసం సూర‌త్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చెత్త ట్రాక్ట‌ర్‌ను వ‌ల్సాడ్‌కు పంపింది. చెత్త‌ను త‌ర‌లించే ట్రాక్ట‌ర్ల‌లో వెంటిలేట‌ర్ల‌ను త‌ర‌లించడంతో ఉన్న‌తాధికారులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ విచార‌ణ‌కు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *