మానసిక ప్రశాంతతకు, ఉత్తేజంకై చేయండి ప్రాణాయామా..

Spread the love

దిన దినం మారుతున్న మనిషి జీవన విధానం.. బిపీ , షుగర్ , మొకాళ్ల నొప్పులు ,ధైరాయిడ్,వెన్నునొప్పి, అలసట ,ఆవేశం వంటి అనారోగ్య సమస్యలు. దీంతో చిన్నా పెద్దా రోగాలకు ఆస్పత్రికి వెళ్లడం.. వాళ్ళు ఇచ్చే మందులు వేసుకోవడం లక్షలు లక్షల ఖర్చు.. పోనీ పరిపూర్ణ ఆరోగ్యం పొందుతామా అంటే.. అది కూడా అనుమానమే..

ప్రస్తుతం మన సమాజంలో భయపెడుతున్న, బాధపెడుతున్న చిన్న పెద్ద వ్యాధులనుంచి నిరాశా నిసృహల నుంచి యోగా ద్వారా బయటపడవచ్చు. మెడిటేషన్ చేయడం ద్వారా డిప్రెషన్ నుంచి కూడా బయటపడొచ్చు.దీని ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చు .. ఈరోజు మెడిటేషన్ లోని దీనినే ప్రాణాయామా (మెడి బ్రీతింగ్ )విధానం గురించి ప్రయోజనాల గురించి తేలుకుందాం..!

మనసుని ప్రశాంతంగా ఉంచడానికి ఆలోచనల నుంచి మనసును క్లియర్ చేసే ప్రక్రియే మెడి.. మనం పీల్చే గాలి మీద దృష్టిసారించడం వల్ల అది శరీరాన్ని, మనసునూ ఉత్తేజితం చేస్తుంది. ఎవరికైనా ఆందోళన ఉన్నప్పుడు బాగా నిద్రపోయి లేచినప్పుడు అలసట తొలగి మనకు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో, ఈ ధ్యానం ద్వారా అలాంటి ఉత్సాహం, ఉత్తేజం, ప్రశాంతత కలుగుతాయని మన యోగా పురుషులు చెప్పారు.

ప్రాణాయామా చేయు పద్దతి :

ముందుగా పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చోవాలి.
తర్వాత రెండు నాసికా రంధ్రాల నుంచి గాలిని పూర్తిగా వదలాలి.
తరువాత కుడి చేతి బొటన వేలితో కుడి నాసికా రంధ్రాన్ని మూసివేసి ఎడమ నాసికారంధ్రం ద్వారా గాలిని లోపలి పీల్చాలి.
ఇలా పీలుస్తున్న సమయంలో తలను నెమ్మదిగా పైకెత్తాలి.
అప్పుడు ఎక్కువ మొత్తంలో గాలిని లోపలి తీసుకోవడానికి వీలు అవుతుంది.
అదే స్టేజ్ లో కొంచెం సేపు ఉండాలి.
తర్వాత మళ్ళీ మళ్లీ ఎడమ నాసికా రంధ్రం ద్వారానే గాలి పూర్తిగా వదులుతూ తలను నెమ్మదిగా కిందికి వంచాలి.
ఇలా ఒకసారి చేస్తే ఒక ఆవర్తనం పూర్తయినట్టు.
రోజూ ఇలా కనీసం పది నుంచి పదిహేను ఆవర్తనాలు చేయాలి.
ఇక కుడి చేతి మధ్య వేలుతో ఎడమ నాసికా రంద్రాన్ని మూసివేసి కుడినాసికారంధ్రం ద్వారా గాలిని లోపలి పీల్చాలి..
ఇలా పీలుస్తున్న సమయంలో తలను నెమ్మదిగా పైకెత్తాలి.
ఎడమ వైపు చేసిన విధంగానే చేయాలి
కుడి నాసికా రంధ్రం ద్వారా వదలాలి.
ఇలా కనీసం పది నుంచి పదిహేను ఆవర్తనాలు చేయాలి. ఇలా మెడిటేషన్ చేయడం ద్వారా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *