రాశీఖన్నా కిక్ బాక్సింగ్..
రాశీఖన్నా సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేసి కుర్రకారుకి మతులు పొగొట్టేస్తుంది. అయితే ఇప్పుడు రూట్ మార్చింది. ఫిట్నెస్ కోసం రెగ్యులర్ జిమ్ ఎక్సర్సైజులు చేయడమే కాదు.. అంతకు మించి కష్టపడుతుంది. ఇంతకీ రాశీఖన్నా ఏం చేస్తుందో తెలుసా? కిక్ బాక్సింగ్ నేర్చుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్లో సన్నీ అనే సినిమాలో నటించడానికి రాశీఖన్నా ఓకే చెప్పింది. సినిమాలో పాత్ర కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకోవడమే కాదు.. సీరియస్‌గా కిక్ బాక్సింగ్ ట్రైనింగ్‌లో లీనమైంది రాశి.
ప్రతిరోజూ రెండు గంటల పాటు హై ఇంటెన్స్ ఇటర్వెల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. కిక్ బాక్సింగ్ వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల శారీరకంగానే కాదు, మానసికంగానూ బలంగా తయారవుతాం. దీని కోసం ప్రత్యేకమైన డైట్‌ను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎంత పెద్ద ఛాలెంజ్‌నైనా ఎదుర్కొంటాననే మానసిక ధైర్యం ఏర్పడింది“ అని చెప్పింది రాశీఖన్నా.