మే 2న.. నేను చెప్పిందే నిజమవుతుంది : ప్ర‌శాంత్ కిశోర్‌

Spread the love

కోల్‌కతా: ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మ‌రో స‌వాలు విసిరారు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌.. దేశంలో ప్ర‌జాస్వామ్యం కోసం జ‌ర‌గ‌బోతున్న కీల‌క‌మైన పోరులో ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌జ‌లు ఇప్ప‌టికే ఎవ‌రిని గెలిపించాలో నిర్ణ‌యించుకున్నారు. బెంగాల్ త‌న సొంత బిడ్డ‌నే మ‌ళ్లీ కోరుకుంటోంది అంటూ పీకే ట్వీట్ చేశారు. తాను గ‌తంలో చేసిన ట్వీట్‌కు మే 2వ తేదీ (ఓట్ల లెక్కింపు)న త‌న‌ను బాధ్యున్ని చేసుకోవ‌చ్చని కూడా పీకే స‌వాలు విసిరారు. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ప్ర‌శాంత్ కిశోర్.. బెంగాల్ ఎన్నిక‌ల‌పై ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి క‌నీసం రెండంకెల సీట్లు కూడా రావ‌ని పీకే అంచ‌నా వేయ‌డం గ‌మనార్హం. ఈ ట్వీట్‌కు ఇప్ప‌టికీ తాను క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు త‌న తాజా ట్వీట్‌తో ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప‌శ్చిమ బెంగాల్లో మొత్త 8 విడ‌త‌ల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు శుక్ర‌వారం ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వ‌ర‌కూ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మే 2న ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *