పైన ప‌టారం సాంగ్‌తో రచ్చ చేయనున్న అన‌సూయ..

Spread the love

అందాల భామ అనసూయ భరద్వాజ్ ఇప్పుడు టీవీ షోస్ క‌న్నా సినిమాల‌తోనే బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ఖాతాలో రంగ‌మార్తాండ‌, ఖిలాడి, పుష్ప‌, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక కార్తికేయ హీరోగా తెర‌కెక్కుతున్న‌చావు కబురు చ‌ల్ల‌గా చిత్రంలో అన‌సూయ ఐటెం సాంగ్ చేస్తుందని ఇటీవ‌ల మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్ వ‌చ్చింది. పైన ప‌టారం అనే ప‌ల్ల‌వితో సాంగ్ మొద‌లు కానుండ‌గా, ఈ సాంగ్ వీడియో ప్రోమోను సాయంత్రం 4.05 ని.లకు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.

పోస్ట‌ర్‌లో కార్తికేయ‌, అన‌సూయ చాలా ఎనర్జిటిక్‌గా క‌నిపిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా రూపొందుతున్న చావు క‌బ‌రు చ‌ల్ల‌గా చిత్రంలో ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించారు. నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు అనే పాట‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *