విజయ్‌తో మూడోసారి రష్మిక..?

Spread the love

‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో నటించి క్యూట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు విజయ్‌ దేవరకొండ, రష్మిక.. వీరిద్దరి మొదటి చిత్రం దర్శకుడు పరశురామ్ రూపొందించిన `గీతగోవిందం` బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లోనే తెరకెక్కిన `డియర్ కామ్రేడ్` కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో మూడో సినిమా రాబోతోందట.

విజయ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూపొందించనున్న సినిమాలో రష్మికనే హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. సుకుమార్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న `పుష్ప`లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ షూటింగ్ సమయంలో రష్మిక నటన, అంకితభావం సుకుమార్‌కు చాలా నచ్చాయట. అందుకే తన తర్వాతి సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నాడట. అదే నిజమైతే మరోసారి విజయ్, రష్మిక తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *