ఢిల్లీలో భారీగా పొగమంచు..

Spread the love

దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దీంతో పలు చోట్ల దృశ్యమానతను ప్రభావితం చేసింది. అలాగే కాలుష్యం సైతం పెరిగింది. సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) ప్రకారం.. గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 307కు చేరింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఐటీఓలో 392, ఆర్కెపురంలో 412, చాందిని చౌక్‌లో 406 ఏక్యూఐ రికార్డయింది.

ఢిల్లీ విమానాశ్రయంలో తక్కువ దృశ్యమానత నమోదైంది. అలాగే పంజాబ్, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్‌, వాయువ్య రాజస్థాన్‌లోని వివిధ ప్రదేశాల్లో దట్టమైన పొగమంచు ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *