ర‌ష్మిక క‌ల‌ర్‌ఫుల్‌ వీడియో అదిరిపోయింది..

Spread the love

క‌న్న‌డ అందం ర‌ష్మిక మంద‌న్నా మ్యూజిషియ‌న్ బాద్‌షాతో క‌లిసి టాప్ ట‌క్క‌ర్ మ్యూజిక్ వీడియో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లే సాంగ్ టీజ‌ర్ లో ధ‌గ‌ధ‌గ మెరిసిపోయింది ర‌ష్మిక‌. తాజాగా మేక‌ర్స్ టాప్ ట‌క్క‌ర్ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు.

బాద్‌షా, అమిత్ స్టైలిష్ ఫ‌ర్ ఫార్మెన్స్ తో అల‌రిస్తుండ‌గా..ర‌ష్మిక క‌ల‌ర్‌ఫుల్ గా కనిపిస్తూ త‌న అంద‌చందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ మ్యూజిక్ వీడియోకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తుంది. ఈ సాంగ్ ను బాద్‌షా , విఘ్నేశ్ శివ‌న్ రాయ‌గా..ఉచ‌నా అమిత్, యువ‌న్ శంక‌ర్ రాజా, బాద్ షా, జొనితా గాంధీ పాడారు.

ర‌ష్మిక తొలిసారి హిందీలో చేసిన‌ ఈ మ్యూజిక్ వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. టాప్ టాప్ ట‌క్క‌ర్ చాలా ఎక్జ‌యిటింగ్ గా ఉంది. మొద‌టిసారి నేనిలాంటి వీడియో చేశానంటూ త‌నం సంతోషాన్ని ఇప్ప‌టికే అభిమానులు, ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకుంది ర‌ష్మిక‌.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *