జాక్వెలిన్ ఫోజ్ కి సెలబ్రిటీలు సైతం ఫిదా..

Spread the love

ఓ పక్క బికినీలతో వేడెక్కిస్తారు మరో పక్క హాట్ ఫొజులతో మైమరపిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీస్. నిరంతరం ఏదో ఒక హాట్ పిక్ ని సోషల్ మీడియాలో పడేయకపోతే కంటిపై కునుకురానట్టుందీ భామలకు. వీరి కునుకుమాటేమో గాని వీరు పోస్ట్ చేసే హాట్ ఫొటోలతో యూత్ కి నిద్రపట్టనిచ్చేటట్టు లేరు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తోన్న ఫొటో చూస్తుంటే అదే నిజమని పిస్తోంది. హాట్ ఫోజ్ లో మెరిసిపోయింది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.

ఇది ఓ యోగా ఫోజ్ అట..చాలా కష్టమైన ఫోజ్ కూడా ఇది. ఆ విషయం ఈ ఫొటో చూస్తేనే అర్థమవుతోంది. అందుకే ఈ ఫొటోని తెగ లైక్ చేస్తున్నారట నెటిజన్స్..వారితో పాటు పలువురు సినీ తారలు కూడా జాక్వెలిన్ ఫోజ్ కి ఫిదా అయిపోయారంటే నమ్మండి. అలాద్దీన్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ శ్రీలంకన్ సుందరి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌.

ఆ తర్వాత హౌస్ ఫుల్ ప్రాంఛైజీ చిత్రాలతోపాటు స్టార్ హీరోల సినిమాల్లో తన అందచందాలు, నటనతో అందరిని మైమరిపింపజేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో హాట్ లుక్ ఫొటోలు పోస్ట్ చేసి కుర్రకారును గుండెల్ని పిండేస్తోంది. వైట్ ఫుల్ షర్టుతో బల్లెరినా డ్రెస్ తో స్టన్నింగ్ చేసే ఫోజులు ఇచ్చి మెస్మరైజ్ చేస్తున్నాయి. జాక్వెలిన్ హాట్ హాట్ గా కనిపిస్తున్న స్టిల్స్ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫ్..నిన్ను చూస్తే ఆశ్యర్యంగా ఉంది..అంటూ సాక్షాత్తు యోగాబ్యూటీ శిల్పాశెట్టి కూడా కామెంట్ పోస్ట్ చేసిందంటేనే అర్థమవుతోంది జాక్వెలిన్ ఇచ్చిన ఫోజ్ ఎంత కఠినతరమైయినదో అని. ఇక మరో బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ అమేజింగ్ అంటూ మరో కామెంట్ పెట్టింది. రెండు చేతులు నేలకి అనించి బాడీ మొత్తాన్ని పైకి లేపడమంటే మాటలు కాదు సుమా అంటున్నారు పలువురు తారలు. వాట్ యే కాన్ఫిడెంట్ అంటూ జాక్వెలిన్ ని తెగ కొనియాడారు. నిజం చెప్పాలంటే స్టన్నింగ్ గా ఉంది ఈ లుక్. జాక్వెలిన్ ప్రస్తుతం అటాక్‌, బూత్ పోలీస్‌, సర్కస్, బచ్చన్ పాండే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *