ఏప్రిల్ 18న నీట్ పీజీ 2021 పరీక్ష..
న్యూఢిల్లీ : నీట్ పీజీ 2021 పరీక్ష తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నీట్ పీజీ పరీక్షల తేదీలను వెల్లడించింది. ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ 2021 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ ఎగ్జామ్ ఆన్లైన్లో నిర్వహించనున్నారు. నీట్ పీజీ 2021 పరీక్షకు హాజరు కావడానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు జూన్ 30, 2021 తేదీ లోపు లేదా అంతకన్నా ముందు ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి. అవసరమైన ఇతర అర్హత ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. ఇతర వివరాల కోసం nbe.edu.in వెబ్సైట్ను సందర్శించొచ్చు.