రొమాంటిక్ లుక్‌లో చైతూ-సాయిపల్లవి..
టాలీవుడ్ యాక్టర్లు నాగచైతన్య-సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే టీజర్ తో పాత్రలను పరిచయం చేసిన శేఖర్ కమ్ముల అండ్ టీం ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేసింది.
చైతూ, సాయిపల్లవి ప్రేమలోని మధురానుభూతులను ఆస్వాదిస్తున్న స్టిల్ ఆడియెన్స్ ను ఫిదా చేస్తోంది.జీన్స్-షర్టులో చైతూ, లంగావోణిలో సాయిపల్లవి మెస్మరైజింగ్ లొకేషన్ లో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుందని పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్. పవన్ సీహెచ్ మ్యూజిక్ డైరెక్టర్. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడుస్తాయని విశ్వాసంతో ఉన్నామని, త్వరలో లవ్‌స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని శేఖర్ కమ్ముల ఇప్పటికే తెలిపారు.