‘వకీల్ సాబ్’ టీజర్​ వచ్చేసింది

Spread the love

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఇవాళ విడుదల చేశారు. ‘కోర్టులో వాదించడమూ తెలుసు..కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్‌ చెప్పిన డైలాగ్‌ అలరిస్తోంది.

బాలీవుడ్​ హిట్ సినిమా ‘పింక్’​ రీమేక్​గా ‘వకీల్‌ సాబ్’‌ తెరకెక్కించారు. ఇందులో పవన్​ న్యాయవాదిగా కనిపిస్తారు. శ్రుతిహాసన్ కథానాయిక. అంజలి, నివేదా, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దిల్​ రాజు సినిమాను నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *