బీజేపీ గెలుపునకు ఓవైసీ తోడ్పాటు : ఎంపీ సాక్షి మహారాజ్
లక్నో : ఆయా రాష్ర్టాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపునకు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తోడ్పాటు అందిస్తున్నట్లు ఉన్నావ్ ఎంపీ సాక్షి మహారాజ్ పేర్కొన్నారు. ఎంఐఎం వల్లే బీహార్లో అత్యధిక స్థానాలు గెలుపొందామని తెలిపారు. త్వరలో జరగబోయే బెంగాల్ ఎన్నికల్లో కూడా ఓవైసీ పోటీ చేస్తానని ప్రకటించారు.
అక్కడ కూడా తమ గెలుపుకు ఎంఐఎం సహకరించబోతుందన్నారు. యూపీలోని ముస్లిం స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే యూపీకి చెందిన సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్భార్తో ఓవైసీ నిన్న సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
యూపీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఇలా పశ్చిమ బెంగాల్, యూపీలో బీజేపీ గెలుపునకు ఎంఐఎం తోడ్పాటునిస్తుందన్నారు ఎంపీ సాక్షి మహారాజ్. బీహార్ ఎన్నికల అనంతరం ఎంఐఎం బీజేపీ బీ టీమ్ అని రాష్ర్టీయ జనతా దళ్, కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే.