కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ జనవరి 16 నుండి..

Spread the love

ఢిల్లీ : దేశంలో జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించింది. వ్యాక్సిన్‌ పంపిణీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది(వైద్యులు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌, పోలీసులు అదేవిధంగా మహమ్మారిపై పోరాటంలో ప్రత్యక్షంగా ఉన్న వారికి) మొదటి ప్రాధాన్యతగా వాక్సినేషన్‌ను అందించనున్నారు. వీరి అనంతరం 50 ఏళ్ల పైబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తొలి విడతలో మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *