రైతుల‌ను చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించిన కేంద్రం..

Spread the love

న్యూఢిల్లీ : వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న రైతులను మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ నెల 30న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో చర్చ‌ల‌కు ర‌మ్మ‌ని పిలిచింది. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపే ముందు అందులో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించేందుకు కేంద్ర మంత్రులు అమిత్ షా, పియూష్ గోయ‌ల్ స‌మావేశం కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *