లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌ చట్టం

Spread the love

న్యూఢిల్లీ : ‘లవ్‌ జిహాద్‌’ను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు మధ్యప్రదేశ్‌ కేబినెట్ ధర్మ స్వాతంత్ర్య (మత స్వేచ్ఛ) బిల్లు-2020ని ఆమోదించింది.

ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అధ్యతన జరిగిన ప్రత్యేక కేబినెట్‌ సమావేశం జరిగింది. కొత్త బిల్లుతో షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందిన మైనర్‌, మహిళలను బలవంతంగా మతం మార్చితే కనీసం రూ.50వేల జరిమానాతో పాటు పది సంవత్సరాల వరకు జైలు శిక్షపడనుంది. కొత్త బిల్లు ప్రకారం.. ఒకరిపై మత మార్పిడి బలవంతం చేస్తే 1-5 సంవత్సరాల జైలు శిక్ష, రూ25వేల జరిమానా విధించనున్నట్లు హోమంత్రి నరోత్తం మిశ్రా అన్నారు.

ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ, అన్ని మతాలకు, కులాలకు చెందినది.. ఇందులో ఎలాంటి వివక్ష లేదని సీఎం అశోక్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. గత నెలలో యూపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టానికి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేసిన మూడో రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *