రీఎంట్రీ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది..

Spread the love

తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వెండితెర ఎంట్రీ ఇచ్చిన నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తెలుగు, తమిళ భాషలలో నటిస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ఆమె ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ప్రకటనలో వెల్లడించారు. నా పేరిట ఇన్ స్టాగ్రామ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ ఏవైనా పోస్టులు వస్తే వాటి పట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాలంటూ కోరింది. ఇవి పునరుద్ధరణ జరిగిన తర్వాత నేనే అభిమాలకు ఆ విషయం తెలియజేస్తానని వరలక్ష్మి వెల్లడించింది.

తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ సాధారణ స్థితికి చేరుకుంది. నా అకౌంట్‌ని తిరిగి తీసుకొచ్చినందుకు ట్విట్టర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రీఎంట్రీ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది తన ట్వీట్‌లో పేర్కొంది వరలక్ష్మీ. ప్రస్తుతం తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా , విలన్ క్యారెక్టర్లలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగులో రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *