ఆరెంజ్ కలర్ డ్రెస్ లో మెరిసిన రాశీ ఖన్నా..
తెలుగు పరిశ్రమలో అవకాశాలు లేకపోయినా హీరోయిన్ రాశీ ఖన్నా చేతిలో మొత్తం నాలుగు చిత్రాలున్నాయి. మరికొన్ని ఫైనల్ అయి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయట. ఆ చిత్రాలు ఏంటంటే సుందర్ సి `అరణ్మై3`.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో `తుగ్లక్ దర్బార్`… సిద్ధార్ధ్ తో `సైతాన్ కా బచ్చా` చిత్రాలతో పాటు `మేధావి` చిత్రాల్లో నటిస్తోంది.
మరి కొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయట. దీంతో టాలీవుడ్ ని రాశీ లైట్ తీసుకున్నట్టేనా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కోలీవుడ్ ఆఫర్స్ ని కాదనలేక ఇక్కడ తగ్గించుకుందన్న వాదనా అభిమానుల్లో వినిపిస్తోంది. రొటీనిటీకి భిన్నంగా కొత్తదనం ఉన్న స్క్రిప్టుల్ని ఎంచుకునేందుకు రాశీ తపిస్తోందట. అయితే రాశి కన్నా ఈసారి తన లుక్ మార్చి అభిమానులకు అదిరిపోయే షాక్ ఇచ్చింది. ఆరెంజ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది ఈ భామ. ఆ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.