కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన యాంకర్ శ్రీముఖి
బుల్లితెర పాపులర్ యాంకర్, సినీ నటి శ్రీముఖి మరో అడుగు ముందుకేసింది. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ క్రేజ్ కొట్టేసిన శ్రీముఖి గత సీజన్ బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచి ఫుల్ పాపులర్ అయ్యింది. పటాస్ షో ద్వారా బుల్లితెర ఆడియన్స్ అందరికీ చక్కిలిగింతలు పెట్టి ఫేమస్ యాంకర్‌గా పేరు సంపాదించిన ఆమె.. తాజాగా తన ఫ్యామిలీతో దిగిన పిక్ షేర్ చేస్తూ ఓ ముఖ్యమైన విషయాన్ని రివీల్ చేసింది.
అది ఏమిటంటే.. శ్రీముఖి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. తన సొంత ఊరు నిజామాబాద్‌లో జరిగిన నూతన గృహప్రవేశం వేడుకలో పాల్గొంది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇవి ఫుల్ వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి యాంకర్‌గానే కాదు నటిగాను అడపాదడాపా అలరిస్తూ ఉంటుంది. ఆ మధ్య శ్రీముఖి ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని తెరకెక్కించగా, ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.