రష్మిక క్రేజ్ మామూలుగా లేదు..

Spread the love

కన్నడ వాళ్లు కూడా తెలుగు ఇండస్ట్రీపై బాగానే ఫోకస్ చేస్తున్నారు. క‌రాబు మైండు క‌రాబు మెరిసే క‌రాబు నిల‌బ‌డి చూస్తావా రుబాబు.. అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న సృష్టించిన పొగ‌రు సాంగ్ ని ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. క‌న్న‌డలో ఈ సాంగ్ విడుద‌లయ్యిన ద‌గ్గ‌ర‌ నుండి మిలియ‌న్స్ మిలియ‌న్స్ వ్యూస్ తో రికార్డులు సాదించింది. త‌రువాత తెలుగులో కూడా త‌న పొగ‌రు చూపించాడు కన్నడ స్టార్ హీరో దృవ స‌ర్జా. ఈ ఏడాది కన్నడలో హఠాన్మరణం చెందిన చిరంజీవి సర్జా తమ్ముడు ఈయన.

పొగ‌రు అనే టైటిల్ తో వ‌స్తున్న ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పొటీ ప‌డ‌గా 3 కోట్ల‌కి పైగా ఫ్యాన్సీ రేటుతో వైజాగ్ లో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్‌, ఫైనాన్సియ‌ర్, ప్రోడ్యూస‌ర్ డి. ప్ర‌తాప్ రాజు సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా సాంగ్ క‌న్న‌డ‌లో 170 మిలియ‌న్స్ పైగా వ్యూస్ తెలుగులో 43 మిలియ‌న్స్ వ్యూస్ కి పైగా రావ‌టంతో సినిమాపై ఆసక్తి బాగా పెరిగిపోయింది. దానికి తోడు ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

రష్మిక అడుగుపెట్టిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ఈ నమ్మకంతోనే ఇప్పుడు పొగరు సినిమాకు కూడా ఇంత రేట్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగు, క‌న్న‌డ బాష‌ల్లో ఒకేసారి విడుదల కి స‌న్నాహ‌లు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో WWEలో ఫేమ‌స్ ఫైట‌ర్స్ ను విల‌న్స్ గా న‌టించడం విశేషం. ఈ విలన్స్ బాడీ బిల్డ‌ర్స్ కి దృవ స‌ర్జాకి మ‌ద్య యాక్ష‌న్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు చిత్ర యూనిట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *