పోలీసులు దారుణంగా కొట్టారు : ప‌ంజాబ్ రైతు సుఖ్‌దేవ్‌సింగ్‌

Spread the love

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధానిలో జ‌రుగుతున్న రైతుల ఆందోళ‌న‌లో ఓ ఫొటో బాగా వైర‌ల్ అయ్యింది. ఓ పోలీసు వృద్ధ రైతుపై లాఠీ ఎత్తిన ఫొటో అది. ఈ ఫొటోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. అయితే పోలీసులు నిజంగానే ఆ రైతును కొట్టారా అంటూ బీజేపీ అనుమానం వ్య‌క్తం చేసింది.

ఇప్పుడా రైతే జాతీయ చానెల్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. పోలీసులు త‌న‌ను దారుణంగా కొట్టార‌ని చెప్పాడు. ఆ వైర‌ల్ ఫొటోలో ఉన్న‌ రైతు పేరు సుఖ్‌దేవ్ సింగ్‌. 60 ఏళ్ల వ‌య‌సున్న ఈ రైతు సింఘు ద‌గ్గ‌ర ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో పోలీసులు అత‌ని వెంట ప‌డ్డారు. ముందు వాళ్లు మాపై వాట‌ర్ కెనాన్లతో దాడి చేశారు. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు.

చివ‌రికి లాఠీల‌కు ప‌ని చెప్పారు అని సుఖ్‌దేవ్ చెప్పాడు. వాళ్లు కొట్టిన దెబ్బ‌ల‌కు త‌న ఒళ్లంతా గాయాల‌య్యాయ‌ని ఆ రైతు తెలిపాడు. లాఠీ దెబ్బ‌కు క‌మిలిపోయిన త‌న చేతిని కూడా ఈ సంద‌ర్భంగా అత‌ను చూపించాడు. తాను రాళ్లు విస‌ర‌కున్నా, ఎలాంటి నినాదాలు చేయ‌క‌పోయినా.. పోలీసులు త‌న‌ను ఎందుకు కొట్టారో అర్థం కావ‌డం లేద‌ని సుఖ్‌దేవ్ అన్నాడు. పంజాబ్‌లోని క‌పుర్త‌లా నుంచి వ‌చ్చిన ఈ రైతు.. ఇప్ప‌టికీ మిగ‌తా రైతుల‌తో క‌లిసి ఆందోళ‌న చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *