దేశంలోనే ఉత్తమ పోలీస్టేషన్లలో ఒక్కటిగా జమ్మికుంట పోలీస్టేషన్…
భారత హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్ జాబితాలో మొదటి పది స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ పదవ స్థానం లో నిలిచింది. దీంతో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా పోలీసులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశ వ్యాప్తంగా మొత్తం పదహారు వేలకు పైగా పోలీస్ స్టేషన్ ల లో పది పోలీస్ స్టేషన్ లను ఉత్తమ పోలీస్ స్టేషన్ లుగా ప్రతి సంవత్సరం హోం శాఖ ప్రకటిస్తుంది. గత సంవత్సరం ఇదే జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్. కు ఎనిమిదవ స్థానం రాగ ఈ సంవత్సరం జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు పదవ స్థానం రావడం టో కరీంనగర్ సిపీ కమలహాసన్ రెడ్డి జమ్మికుంట పోలీస్ సిబ్బంది కి శుభాకాంక్షలు తెలిపారు.
జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక కావడం పట్ల రాష్ట్ర డి జి పి మహేందర్ రెడ్డి టో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఈటల రాజేందర్,గంగుల కమలాకర్ జిల్లా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారన్నారు. ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక కావడం తో సిపి కమలహాసన్ రెడ్డి , ACP శ్రీనివాసరావు జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు వచ్చి సీఐ సృజన్ రెడ్డి ఎస్సై లను పోలీస్ సిబ్బంది నీ ప్రశంసించారు.