జనవరి 27 న విడుదల కానున్న శశికళ..!

Spread the love

చెన్నై : అక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు జనవరిలో విముక్తి లభించనున్నట్లు సమాచారం. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ…. కోర్టులో 10 కోట్ల సొంత పూచీకత్తు చెల్లించి, జనవరి 27 న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

తన శిక్షా కాలాన్ని తగ్గించాలంటూ ఆమె జైలు అధికారులకు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. ఈ దరఖాస్తును పరప్పన జైలు అధికారులు.. ఉన్నతాధికారులకు పంపించారు. ”శిక్షా కాలాన్ని తగ్గించాలంటూ ఆమె దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తును మేము ఉన్నతాధికారుల పరిశీలనార్థం పంపించాం.” అని అధికారులు పేర్కొన్నారు. అయితే అధికారులు మాత్రం దీనిపై అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *