ఈ నెల 11న విధులు బహిష్కరించండి : ఐఎంఏ

Spread the love

న్యూఢిల్లీ : ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేయడానికి వీలు కల్పించేలా భారతీయ కేంద్ర వైద్య మండలి (సీసీఎంఐ) తీసుకువచ్చిన నోటిఫికేషన్‌ను నిరసిస్తూ ఒక రోజు ఆందోళనలకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది.

కార్యక్రమాన్ని ఆధునిక వైద్యం చేస్తున్న స్వాతంత్రోద్యమంగా ఐఎంఏ పేర్కొంది. నాన్‌ కొవిడ్‌ సేవలను ఉపసంహరించుకుంటున్నామని, ఈ మేరకు ఈ నెల 11న ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలకు వైద్యులు దూరంగా ఉండాలని కోరింది. అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సలు, ఐసీయూలు, సీసీయూలు కొనసాగుతాయని తెలిపింది. దీంతో పాటు కొవిడ్‌ ప్రొటోకాల్స్‌కు కట్టుబడి ఈ నెల 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య 20 మందికి మించకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *