మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న..!

Spread the love

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ రష్మిక మందన్న. వరస సినిమాలతో దుమ్ము దులిపేస్తుంది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా ఆమె వరస అవకాశాలు అందుకుంటుంది.

సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి విజయాల తర్వాత తెలుగులో ఈమెకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ పుష్పతో పాటు శర్వానంద్ ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తుంది రష్మిక. ఇక కన్నడలో పొగరులో నటిస్తుంది. ధృవ సర్జ ఇందులో హీరో. దాంతో పాటు మరో రెండు మూడు కన్నడ సినిమాలు కూడా చేస్తుంది రష్మిక మందన్న.

ఇవన్నీ ఇలా ఉండగానే ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ ఈమె చెంతకు వచ్చినట్లు తెలుస్తుంది. తమిళ స్టార్ సూర్య సినిమాలో ఈమె హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతుంది. నిజానికి గతంలోనే సూర్యతో ఈమె నటించాల్సి ఉన్నా కూడా అనుకోని కారణాలతో ఆ అవకాశం మిస్ అయిపోయింది. ఇప్పటికే తమిళ్ లో కార్తితో సుల్తాన్ సినిమాలో నటిస్తుంది రష్మిక. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు సూర్యతోనూ రొమాన్స్ చేసే అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సూర్య. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తమ్ముడితో రొమాన్స్ చేసిన రష్మిక.. ఇప్పుడు అన్నయ్యతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని తెలుస్తుంది. ఈ మధ్యే ఆకాశం నీ హద్దురా సినిమాతో చాలా ఏళ్ళ తర్వాత హిట్ కొట్టాడు సూర్య. ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి అదిరిపోయే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *