కేసీఆర్‌ వల్లే శాంతియుత హైదరాబాద్ :  పోసాని

Spread the love

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఓటు వేయాలని నటుడు పోసాని కృష్ణ మురళి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో దర్శకుడు ఎన్‌. శంకర్‌తో కలిసి పోసాని మీడియాతో మాట్లాడారు.

ఒకప్పుడు భాగ్యనరంలో ఎక్కువగా మతకలహాలే ఉండేవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలతో మనం శాంతియుత హైదరాబాద్‌ని చూస్తున్నామని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు అన్ని వేళలా విద్యుత్‌, మంచినీరు, సాగునీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.

అనంతరం దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మతరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలని కోరారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని.. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *