ఏయిర్‌ ఇండియా విమానాలను బ్యాన్‌ చేసిన హాంకాంగ్‌..

Spread the love

న్యూఢిల్లీ : హాంకాంగ్‌ డిసెంబర్‌ 3వ తేదీ వరకు ఏయిర్‌ ఇండియా విమానాలపై నిషేధం విధించింది. ఈ వారంలో పలువురు ప్రయాణికులు కొవిడ్‌ పాజిటివ్‌గా పరీక్షించడంతో బ్యాన్‌ చేసిందని ఓ అధికారి తెలిపారు. ఏయిర్‌ ఇండియా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం విధించడం ఇది ఐదోసారి. ప్రయాణానికి 72గంటల్లోగా కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే దేశం నుంచి ప్రయాణికులు హాంకాంగ్‌ చేసుకోవచ్చు. అంతర్జాతీయ ప్రయాణీకులందరూ విమానాశ్రయంలో విమానం ఎక్కే ముందు తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని ఉంటుంది.

ప్రభుత్వ నిబంధన ప్రకారం.. అంతర్జాతీయ ప్రయాణీకులందరూ విమానాశ్రయంలో పోస్ట్-ఫ్లైట్ COVID-19 పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. మొదటిసారిగా ఆగస్ట్‌ 18నుంచి 31 వరకు, రెండోసారి సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 3వ వరకు, మూడో సారి అక్టోబర్ 17-30, నాలుగోసారి అక్టోబర్ 28-నవంబర్ 10 వరకు నిషేధం విధించారు. ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ నుంచి హాంకాంగ్‌ వెళ్లిన విమానంలో కొంత మంది ప్రయాణికులు కొవిడ్‌ పరీక్షల్లో వైరస్‌ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో వచ్చే నెల 3వ తేదీ వరకు విమానాలపై నిషేధం విధించినట్లు ఏయిర్‌ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

అయితే ఈ కాలంలో ఈ సమయాల్లో హాంకాంగ్‌కు ఎలాంటి విమానాలు షెడ్యూల్‌ కాలేదని ఆయన చెప్పారు. భారత్‌, బంగ్లాదేశ్‌, ఇథియోపియా, ఫ్రాన్స్‌, ఇండోనేషియా, ఖజకిస్థాన్‌, నేపాల్‌, పాక్‌, ఫిలిప్పీన్‌, రష్యా, దక్షిణాఫ్రికా, యూకే, అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులందరికీ ప్రీ ఫ్లైట్‌ కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను హాంకాంగ్‌ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *