బీపీ చెకప్ కి వెళ్తున్నారా? అయితే ఇలా చేయండి..!

Spread the love

రక్తపోటు పరీక్షలు తొందర పాటుగా చేయించుకుంటే ఫలితాలు సరిగా రావు.అందువల్ల పరీక్షలకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం..

బీపీ చెకప్‌కి వెళ్లడానికి ఒక అరగంట ముందు నుంచే ఏమైనా తినడం కానీ, కాఫీ, టీ లాంటివి తాగడం,వ్యాయామం చేయడం, మూత్రాన్ని ఆపడం చేయ కూడదు. చేతిని విశ్రాంతిగా ఏదో ఒక సపోర్ట్‌ మీద ఉంచాలి గానీ, గాలిలోకి పెట్టకూడదు.

పరీక్ష కోసం ఉంచే బల్ల మీద కాకుండా కుర్చీలో ప్రశాంతంగా కూర్చోవాలి. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం సరైనది కాదు. పాదాలు పూర్తిగా నేల మీద ఉంచాలి. భుజం మీద ఎటువంటి బరువు ఉండకుండా చూసుకోవాలి.

రక్తపోటు పరీక్షా జరుగుతున్న సమయంలో మాట్లాడకుండా ఉండాలి. ఏదైనా ఆరోగ్య సమస్యతో హాస్పటల్స్‌ కి వెళ్ళగానే మొదటగా చేసేది బీపీ చెకప్.

ఈ బీపీ ఆధారంగానే మనకు మిగతా పరీక్షలు చేస్తారు . అయితే చాలామంది లోబీపీ కళ్ళు తిరుగుతున్నాయి అని లేదా ఎవరైనా అరిస్తే హైబీపీ అంటుంటారు.

సాధారణంగా 120/80 ఉంటే బీపీ నార్మల్ గా ఉన్నట్టు. దీనికన్నా ఎక్కువగా ఉన్నాలేదా తక్కువగా ఉన్నా ఆరోగ్యసమస్యలు వస్తాయి. కాబట్టి బీపీ కంట్రోల్‌లో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా బీపీ చెకప్ చేసుకుంటుండాలి.

అదేవిధంగా 140/90 ఉంటే హైపర్ టెన్షన్ ముందు దశ అని చెప్పాలి. 140/90 కంటే ఎక్కువ ఉంటే హైబీపీ ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. బీపీ ఎప్పుడూ నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి.

బీపీ తక్కువైనా ఎక్కువైనా ఆరోగ్య సమస్యలు తప్పవు. బీపీ తక్కువగా ఉంటే కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, అలసటగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదేవిధంగా బీపీ ఎక్కువగా ఉంటే.. గుండె నొప్పి ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు బీపీ కంట్రోల్‌లోఉండేలా చూసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *