నివేద పేతురాజ్ కి మరో సినిమా ఛాన్స్

Spread the love

అందం, అభినయం వున్న అమ్మాయిలకు టాలీవుడ్ ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. అందుకే, ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ఎంతోమంది అమ్మాయిలు ఇక్కడ కథానాయికలుగా రాణిస్తుంటారు. ఆ క్రమంలో యువ కథానాయిక నివేద పేతురాజ్ కూడా ఇప్పుడు తెలుగులో బిజీ అవుతోంది.

‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగుకి పరిచయమైన ఈ తమిళ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం నివేదకు మరింత పేరుతెచ్చింది. ప్రస్తుతం రామ్ సరసన ‘రెడ్’ సినిమాలోనూ, సాయితేజ్ పక్కన మరో సినిమాలోనూ నటిస్తోంది.

ఈ క్రమంలో ఈ చిన్నదానికి తాజాగా టాలీవుడ్ నుంచి మరో ఆఫర్ కూడా వచ్చింది. విష్వక్ సేన్ నటిస్తున్న ‘పాగల్’ చిత్రంలో ఓ కథానాయికగా నివేద ఎంపికైంది. నరేశ్ కుప్పులి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భావోద్వేగాలతో కూడిన లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *