ఢిల్లీలో వాయు కాలుష్యం..

Spread the love

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన విభాగంలోనే కొనసాగుతోందని సిస్టం ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (సఫర్‌) తెలిపింది. ఆదివారం తేలికపాటి జల్లులు కురిసినా.. గాలి నాణ్యత సూచీ 490గా నమోదైందని పేర్కొంది. ఏక్యూఐ 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా, 201-300 మధ్య పేలవమైన, 301-400 చాలా పేలవమైన, 401-500 తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తున్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న కాలుష్యంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇప్పటికే వ్యాధులతో బాధపడుతున్న వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. సోమవారం నుంచి 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని భారత వాతావరణశాఖ (ఐఎండీ) శాస్త్రవేత్త ఆర్‌కే జెనమణి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *