6.98 శాతానికి చేరిన నిరుద్యోగ రేటు..

Spread the love

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ రేటు 6.98 శాతానికి చేరింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 6.67 శాతంగా ఉన్న ఈ రేటు అక్టోబర్‌లో 6.98 శాతానికికి పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది.

వ్యవసాయ రంగం పుంజుకున్నప్పటికీ నిరుద్యోగ రేటులో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. గత నెల కంటే నిరుద్యోగ రేటు 1.04 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని సీఎంఐఈ వెల్లడించింది. అయితే అర్బన్‌ ప్రాంతాల్లో కాస్త మెరుగైన పరిస్థితి కనిపిస్తున్నట్లు చెప్పింది. సెప్టెంబర్‌ నెలలో 8.45 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు అక్టోబర్‌ నెలలో 7.15 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.

దేశంలో ఒకవైపు నిరుద్యోగ రేటు శాతం పెరుగుతున్నప్పటికీ మరోవైపు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ వరకు 10.2 శాతంమేర పెరిగాయి. అక్టోబర్‌ నెలలో తొలిసారి లక్ష కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. లాక్‌డౌన్‌కు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వసూలైన రూ.1.05 లక్ష కోట్ల మాదిరిగానే అక్టోబర్‌ నెలలో జీఎస్టీ ఆదాయం రూ.1,05,155 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *