హైదరాబాద్ లో మరోసారి చిరుత హల్చల్

Spread the love

హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో మరోసారి చిరుత హల్చల్ చేసింది. రాజేంద్రనగర్ లో చిరుతపులి సంచారం చేయడం కలకలం రేపుతోంది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత కలియతిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అక్కడికి దగ్గరలోనే గ్రేహౌండ్స్ పోలీసుల శిక్షణ కేంద్రంలోని మరో సీసీటీవీలో రాత్రి 8.30 గంటల సమయంలో చిరుత అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో సంచరించినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి చిరుత గగన్‌పహాడ్ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా ఆనవాళ్లు లభించాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ , పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు . చిరుత ఆచూకీ కోసం ముమ్మరంగా అన్వేషణ ప్రారంభించారు . ఫుట్ ప్రింట్స్ ఆధారంగా అది అడవిలోని చెరువు దగ్గరకు వెళ్లి నీళ్లు తాగినట్టుగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *