ఇకనుండి 11 అంకెల మొబైల్ నంబర్‌లు

Spread the love

న్యూ ఢిల్లీ : టెలికాం నియంత్రణ సంస్థ మొబైల్ నంబర్ల విషయంలో కీలక ప్రతిపాదనలు చేసింది. దేశంలో 11 అంకెల మొబైల్ నంబర్‌ను వినియోగించాలని ప్రతిపాదించింది. పలువురితో చర్చల అనంతరం కొన్ని సిఫార్సులను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 10 అంకెల మొబైల్ నంబర్లు ఉన్నాయి. ఇకపై 11 అంకెల మొబైల్ నంబర్లను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా కొత్తగా నంబర్ల సంఖ్యను పెంచుకోవచ్చని ట్రాయ్ తెలిపింది. మొబైల్ నంబర్లకు ముందు 9 అంకెను కలపడం ద్వారా అవి 11 అవుతాయి . ఇకపై ల్యాండ్ లైన్ల నుంచి మొబైల్ కు కాల్ చేస్తే వాటి నంబర్ల ముందు సున్నా కలపాలని టెలికాం నియంత్రణ సంస్థ సూచిందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *