పిడుగు పాటుతో ముగ్గురు మృతి

Spread the love

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ముగ్గురు మరణించారు. జిల్లాలో ఒక్కసారిగా ఉరుములు , మెరుపులతో వర్షం కురిసింది. వంగర మండలంలో ఇద్దరు మరణించగా , సీతంపేట మండలంలో మరొకరు మృత్యువాత పడ్డారు. వంగర మండలంలో మరణించిన వారిలో అచ్యుతరావు అనే పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నాడు . మరో ఇద్దరు పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుకు బలయ్యారు. మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *