వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

Spread the love

హైదరాబాద్ : విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది హుటాహుటిన నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. వరవరరావు ప్రస్తుతం మహారాష్ట్రలోని తాళోజీ జైలులో ఉన్నారు. పూణె నగరంలోని విశ్రంబాగ్ పోలీస్ స్టేషన్ వర్గాలు ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలియజేశారు. దీంతో వరవరరావు కుటుంబ సభ్యులను ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అనుమతిచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *